Niharika Konidela : మెగా డాటర్ కొణిదెల పేరు ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఈమె ఉగాది రోజు పబ్‌కు వెళ్లి అర్థరాత్రి వరకు అక్కడ ఉండడం ఏమోగానీ.. అందరూ నాగబాబును విమర్శించారు. డ్రగ్స్ తీసుకోలేదు సరే.. అంత రాత్రి పూట భర్త లేకుండా అది కూడా తెలుగు పండుగ రోజు ఒక తెలుగు యువతి పబ్‌లో ఏం చేస్తుంది ? ఉగాది పచ్చడి తింటుందా ? అని నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే అది గతం. ఆ సంఘటన తరువాత నిహారిక ఇంటికే పరిమితం అయింది. కానీ తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కనిపించింది. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది.
డ్రగ్స్ కేసుకు ముందే నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఆమె చివరిసారిగా అందులో ఫిబ్రవరి 27వ తేదీన పోస్ట్ పెట్టింది. అంటే సుమారుగా 2 నెలల అనంతరం మళ్లీ అందులో ఆమె తాజాగా ఇప్పుడే పోస్ట్ పెట్టింది. ఇక ఆ పోస్ట్‌లో తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేయడంతోపాటు దాని కింద ఓ కాప్షన్ కూడా పెట్టింది. తాను 8 వారాల అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లోకి మళ్లీ వచ్చానని.. ఈ బ్రేక్ తరువాత తాను ఎంతో రీఫ్రెష్‌గా ఫీలవుతున్నానని ఆమె తెలిపింది.
ఈ 8 వారాల ఇన్‌స్టాగ్రామ్ బ్రేక్‌లో తాను 3 పాఠాలను నేర్చుకున్నానని.. 1. ప్రపంచం అంతం కాలేదని, 2. ఇతరులు ఏమన్నా.. ఏం చేసినా తాను పట్టించుకోనని, 3. ఇప్పుడు కొత్త అనుభూతితో తాజాగా ఫీలవుతున్నానని.. నిహారిక పోస్ట్ చేసింది. దీంతో తనను విమర్శించిన వారికి ఆమె ఇలా కౌంటర్ వేసినట్లు పోస్ట్ పెట్టిందా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లు చేస్తోంది. త్వరలోనే అవి విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…