Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దాదాపు 4 ఏళ్ల గ్యాప్ అనంతరం ఆచార్య సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇందులో ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఇంకో కీలకపాత్రలో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తొలి రోజే చాలా చోట్ల థియేటర్లలో ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి. అయితే ఈ మూవీ నెమ్మదిగా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచే నెగెటివ్ టాక్ ఎక్కువైపోయింది. చాలా మంది సినిమా బాగాలేదనే అంటున్నారు. దీంతో తప్పుడు ఎక్కడ జరిగిందో చిత్ర యూనిట్ వెతికే పనిలో పడింది. అయితే ఆచార్య చిత్రం ఫ్లాప్‌ను మూటగట్టుకున్న తరుణంలో చిరంజీవికి చెందిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే..
చిరంజీవి ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంతో ఒక పాత సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయిందని అంటున్నారు. అదేమిటంటే.. చిరంజీవి నటించిన పలు చిత్రాలు ఆ అనే అక్షరంతో మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకని చిరంజీవికి ఆ అనే అక్షరం కలసి రాలేదని అంటున్నారు. దీన్ని ఇంకా పరిశీలిస్తే.. చిరంజీవి కెరీర్‌లో ఆ అనే అక్షరంతో వచ్చిన మొదటి సినిమా ఆరని మంటలు. అప్పటికి ఆయనకు ఇంకా ఇమేజ్ రాలేదు. దీంతో ఈ సినిమా ఆడలేదు.
తరువాత చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా పెద్దగా విజయం సాధించలేదు. అలాగే ఆలయ శిఖరం, తమిళ డైరెక్టర్ భారతీరాజాతో చేసిన ఆరాధన, కె విశ్వనాథ్ ఆపద్బాంధవుడు.. వంటి చిత్రాలు కూడా ఆ అనే అక్షరంతోనే మొదలయ్యాయి. ఇవన్నీ ఫ్లాప్ సినిమాలే. ఆరాధన, ఆపద్బాంధవుడు చిత్రాలు చిరంజీవికి నటన పరంగా పేరు తెచ్చాయే కానీ.. కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆ అనే అక్షరంతో వచ్చిన ఆచార్య కూడా ఫెయిల్ అయింది. కనుక చిరంజీవికి ఆ అనే అక్షరం కలసి రాలేదని అంటున్నారు.
అయితే మొదటి అ తో వచ్చిన అడవిదొంగ, అల్లుడా మజాకా, అన్నయ్య లాంటి సినిమాలు మాత్రం ఘన విజయం సాధించాయి. అందుకని రెండో ఆ చిరుకు అచ్చి రాలేదని అంటున్నారు. ఇక ఆయన నటిస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు ఈ ఏడాది వరుసగా రిలీజ్ కానున్నాయి. అవి హిట్ అవుతాయో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…