News : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఆమెకు ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన అతను ఆగ్రహంతో ఊగిపోయి ఆమెపై దాడి చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని చాందిని మహల్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి తన భార్య (32)ను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. ఆమె ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ ఆమెను వేధించడమే కాక.. ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు. ఇద్దరి మధ్యా తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి. వీరికి ఒక కుమార్తె ఉంది.
కాగా గత శుక్రవారం యథావిధిగా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన రహమాన్ తన భార్యపై దాడి చేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కత్తితో నరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తె తన తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి హతాశురాలైంది. దీంతో వెంటనే విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రహమాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అతను ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసులకు అక్కడి ఖ్వాజా మీర్ దర్ద్ అనే ప్రాంతంలో దొరికాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ సమయంలో అతను రక్తపు మరకలతో కూడిన చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…