Thaman : సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా కలసి నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇక ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా మహేష్ ఈ మూవీలో భిన్నమైన లుక్, మానరిజంలో కనిపించనున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన మ.. మ.. మహేషా.. సాంగ్‌కు విపరీతమైన స్పందన లభిస్తోంది.
అయితే థమన్ అంటేనే గతంలో వచ్చిన సినిమాల్లోని పాటలను కాపీ చేసి వాడుకుంటాడనే మచ్చ ఉంది. దీంతో ఇప్పుడు కూడా థమన్‌ను అదే విషయంలో ట్రోల్ చేస్తున్నారు. మ.. మ.. మహేషా సాంగ్ గతంలో వచ్చిన అల్లు అర్జున్ మూవీ సరైనోడులోని బ్లాకు బస్టర్.. బ్లాకు బస్టరే.. పాటను పోలి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ పాట.. ప్రస్తుత పాట సంగీతం ఒకేలా ఉందని అంటున్నారు. థమన్ మళ్లీ కాపీ కొట్టాడని వారు విమర్శిస్తున్నారు.
అయితే తనపై ఎప్పుడూ ఈ విధంగా వచ్చే ట్రోల్స్‌ను, విమర్శలను పట్టించుకోనని థమన్ గతంలోనే చెప్పారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఈ ట్రోల్స్‌ను ఆయన పట్టించుకోవడం లేదు. అయితే ప్రీ రిలీజ్ వేడుకలో థమన్ ను మహేష్ ఆకాశానికెత్తారు. కళావతి సాంగ్ అద్భుతంగా వచ్చిందని.. ఆ క్రెడిట్ అంతా థమన్‌కే దక్కుతుందని మహేష్ కొనియాడారు. ఇక సర్కారు వారి పాటలోని కళావతితోపాటు ఆ తరువాత వచ్చిన పెన్నీ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి థమన్ చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారని మహేష్ అన్నారు. మరి మూవీలో బీజీఎం ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…