Mohan Babu : సీనియర్ నటుడు మోహన్ బాబుపై ట్రోల్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా నెటిజన్లు ఈ మధ్య కాలంలో తరచూ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ ట్రోల్స్ ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. అలాగే ఏపీలో సినీ రంగ సమస్యలను పరిష్కరించడంలోనూ మంచు విష్ణు ఫెయిల్ అయ్యారని చెప్పి నెటిజన్లు అప్పటి నుంచి మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ పెరిగిపోతూనే ఉన్నాయి.
ఇక మోహన్‌బాబు నటించిన సన్నాఫ్ ఇండియా మూవీపై అయితే ఏ తెలుగు సినిమాపై రానన్ని ట్రోల్స్ వచ్చాయి. దీంతో నొచ్చుకున్న మంచు మోహన్ బాబు, విష్ణు తమను ట్రోల్ చేస్తే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై కూడా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ తరువాత వారు సైలెంట్ అయిపోయారు కానీ వారిపై వచ్చే ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఇక తాజాగా మరోమారు మంచు మోహన్ బాబు దొరికిపోయారు. ఆయనను ఒక రేంజ్‌లో నెటిజన్లు ఆడుకుంటున్నారు. తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆయనపై విమర్శలు కూడా వస్తున్నాయి.
మంచు లక్ష్మి నటిస్తూ నిర్మిస్తున్న మూవీ అగ్ని నక్షత్రం. ఇందులో ఆమెతోపాటు మోహన్ బాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందులో తాను ప్రొఫెసర్ విశ్వామిత్రగా నటిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఆ ట్వీట్‌కు చివర్లో తనకు భయంగా ఉందని చెప్పారు. ఇదే నెటిజన్లకు అస్త్రంగా మారింది. ఈ వాక్యాన్ని ఉద్దేశించే ఆయనను మరోమారు ట్రోల్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సినిమా తీస్తున్న మీకే ఇంత భయంగా ఉంటే.. దాన్ని చూసే మాకు ఎంత భయంగా ఉండాలి.. అని నెటిజన్లు ఆయన ట్వీట్‌కు కౌంటర్ ఇస్తున్నారు. అలాగే సన్నాఫ్ ఇండియా సెకండ్ పార్ట్ రాబోతోంది.. అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇక కొందరైతే మోహన్ బాబును ఫైర్ స్టార్ అంటూ ఆట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనవసరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారని అర్థమవుతోంది. అయితే దీనిపై ఆయన గానీ.. మంచు ఫ్యామిలీగానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…