Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ వల్ల అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమా హిందీ మార్కెట్‌లోనే కాకుండా విదేశీ మార్కెట్‌లోనూ భారీగానే వసూలు చేసింది. అన్ని భాషల్లోనూ కలిపి రూ.360 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. దీంతో పుష్ప 2 ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 బడ్జెట్ రూ.350 కోట్లు అవుతుందని సమాచారం.
ఇక పుష్ప 2కు గాను ఇప్పటికే స్క్రిప్ట్ పనిని పూర్తి చేశారని తెలుస్తోంది. కానీ అందులో మళ్లీ మార్పులు చేస్తున్నారట. అందువల్ల షూటింగ్ కు ఇంకా ఆలస్యం అవుతోంది. కాగా పుష్ప 2 చిత్రానికి కేటాయించిన బడ్జెట్‌లో 60 శాతం హీరో, దర్శకుడిదే ఉండడం విశేషం. పుష్ప 2 మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.120 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు సుకుమార్ రూ.80 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అయితే అల్లు అర్జున్ పుష్ప మొదటి పార్ట్‌కు రూ.30 కోట్లు తీసుకుని ఇప్పుడు దాన్ని అమాంతం రూ.120 కోట్లకు పెంచడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అంటున్నారు. ఇక సుకుమార్ ఒక మూవీకి గరిష్టంగా రూ.15 కోట్లు తీసుకునేవారు. కానీ దానికి 6 రెట్ల రెమ్యునరేషన్‌ను ఇప్పుడు పొందుతున్నారు. దీంతో వీరిద్దరి పారితోషికమే సినిమా బడ్జెట్‌లో 60 శాతంగా ఉండడం విశేషం.
ఇక ఆగస్టు చివరి వారం నుంచి పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. అందువల్ల షూటింగ్‌కు అంతరాయం కలుగుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రారంభం కావల్సిన మహేష్, త్రివిక్రమ్ మూవీ సైతం వాయిదా పడింది. దీంతో మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయనేది సందేహంగా మారింది. ఇక పుష్ప 2 ను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీంట్లో సునీల్, అనసూయ, ఫహాద్ పాజిల్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది. 2023లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…