Anasuya : బుల్లితెర యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో అనసూయకు వెండితెర ఆఫర్స్ వచ్చాయి. క్షణం సినిమాతో బిగ్ స్క్రీన్‌పై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటు బుల్లితెర, అటు వెండితెరపై రాణిస్తూ ముందుకు సాగుతోంది. సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా కోసం కాస్త టైమ్ కేటాయిస్తుంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్‌డేట్స్‌తోపాటు గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ వేదికలపై తన యాక్టివ్‌నెస్ చూపిస్తుంటుంది. ఇక వీలున్నప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తూ వాళ్ళడిగిన ప్రశ్నలపై తనదైన కోణంలో స్పందించడం ఆమె నైజం.

అనసూయ నటిగా మంచి మార్కులు కొట్టేసినా కూడా తన అంద చందాలతో అలరిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొట్టి దుస్తులతో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. ఆమె దుస్తుల విషయంలో ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా కూడా తన పంథా మాత్రం మార్చుకోవడం లేదు. ఇటీవల ఓ స్టైలిష్ డ్రెస్‌లో మెరిసిన అనసూయని చూసి కొందరు మైమరచిపోయారు. కొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఓ నెటిజన్.. అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు.. అంటూ కన్నీరు కారుస్తున్న ఎమోజీని పంచుకున్నాడు సదరు నెటిజన్.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
దీనిపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది. దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు.. అంటూ మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చింది. ఈ దెబ్బకి ఆ నెటిజన్ కి మైండ్ బ్లాక్ అయినంత పని అయింది. కాగా.. అనసూయ ఏ పనైనా చాలా కమిట్‌మెంట్‌తో చేస్తుంటుంది. ఆ మధ్య ఓ నెటిజన్ మీకు పెద్ద సినిమాలో మంచి రోల్ అవకాశం వస్తే.. అవసరమైతే ఆ రోల్ కోసం గుండు కొట్టించుకుంటారా ? అని అడిగాడు. దీనిపై రియాక్ట్ అయిన జబర్దస్త్ బ్యూటీ.. తప్పకుండా.. ఆ క్యారెక్టర్ కోసం అవసరం అనుకుంటే గుండు కొట్టించుకుంటా.. అంటూ ఓపెన్ అయింది. ఇది చూసి సినిమాల పట్ల అనసూయకు ఉన్న మక్కువ, కెరీర్ విషయంలో ఆమె డెడికేషన్ సూపర్.. అంటూ కామెంట్స్ చేశారు.