Disha Patani : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత అభిమానులకు, నటీనటులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలపై అభిమానులు సరాసరి నటీనటులతో నేరుగా ముచ్చటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి సెలబ్రిటీలు కొన్నిసార్లు చేదు సంఘటనలను కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఇలా ఎంతోమంది ముద్దుగుమ్మలు నెటిజన్ల నుంచి ఇలాంటి దారుణమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్నవారు కూడా ఉన్నారు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి అనంతరం తెలుగు తెరకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసింది. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా బిజీగా ఉన్న దిశాపటాని తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో.. ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ ఓ సెషన్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఎవరూ ఊహించని విధంగా ఈమెకు ఓ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు దిశాపటాని దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. బికినీ వేసుకున్న ఫోటోని షేర్ చేయమని నెటిజన్ అడగగా వెంటనే బికినీ వేసుకున్న ఒట్టర్ అనే జంతువు ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోను చూసి సదరు నెటిజన్ ఖంగు తిన్నాడు. ఈ క్రమంలోనే దిశా పటాని ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.