Poonam Kaur : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తే తనను మోసం చేసిన వ్యక్తి గురించి చెబుతానని ఈమె బహిరంగంగా ప్రకటన చేసింది. తరువాత ఆ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేసింది. కానీ ప్రకాష్ రాజ్ అయితే గెలవలేదు. దీంతో ఆమె ప్రకటన అలాగే ఉండిపోయింది. ఇక ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేయడంలో పూనమ్ కౌర్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. కానీ ట్వీట్లు చేశాక వాటిని డిలీట్ చేస్తుంటుంది.
ఇక తాజాగా పూనమ్ కౌర్ మరోమారు వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఆమె పెట్టే ట్వీట్లు వివాదాస్పదం అయినట్లుగానే తాజాగా ఆమె పెట్టిన ఫొటో ఒకటి చర్చకు దారి తీస్తోంది. ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన పూనమ్ దానికి హ్యాపీనెస్ అనే కామెంట్ కూడా పెట్టింది. అయితే వారు ఎవరి పిల్లలు ? అనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఆ పిల్లలు ఎవరు పూనమ్ ? అని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే అందుకు ఆమె సమాధానం చెప్పలేదు. మరి దీనికి ఆమె సమాధానం చెబుతుందో లేదో చూడాలి. ఇక వారు బంధువుల పిల్లలు అయి ఉంటారని తెలుస్తోంది. కాగా పూనమ్ కౌర్ వెండితెరకు దూరం అయి చాలా కాలమే అవుతోంది. ఇటీవలే ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేసింది. ఆమె నటించిన నాతి చరామి అనే సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక పూనమ్ కౌర్ సినిమాల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ అనేక సామాజిక, సినిమా అంశాల పట్ల స్పందిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…