Sravana Bhargavi : టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో పాటలను పాడి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. అన్నమయ్య సంకీర్తలను పాడడంలో ఈమెకు పెట్టింది పేరు. ఈ మధ్యే శ్రావణ భార్గవి, ఆమె భర్త హేమచంద్ర విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీరు ఆ వార్తలపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. తాము విడాకులు తీసుకోవడం లేదు.. అనే విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా వేర్వేరు పోస్టుల ద్వారా చెప్పారు. అయితే ఆ విషయం అక్కడితో ముగిసింది. కానీ తాజాగా మళ్లీ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రావణ భార్గవికి ఒక యూట్యూబ్ చానల్ ఉన్న విషయం తెలిసిందే. అందులో తన పాటలను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఇటీవలే ఆమె ఒక అన్నమయ్య సంకీర్తనను పాడి ఆ వీడియోను అందులో పోస్ట్ చేసింది. ఒకపరి వయ్యారమే అనే పాటను పూర్తిగా ఆధ్యాత్మిక భావనతో దైవం మీద దృష్టి పెట్టి పాడాలి. కానీ శ్రావణ భార్గవి మాత్రం తన అంద చందాలను వర్ణిస్తున్నట్లుగా ఆ పాటను పాడి అదేవిధంగా వీడియోను షూట్ చేసింది. దీంతో ఆ పాట దైవంపై పాట కాకుండా శృంగార పాటగా మారిందని అంటున్నారు. దీనిపైనే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం అన్నమాచార్య వంశీయులతోపాటు టీటీడీ వరకు వెళ్లింది. శ్రావణ భార్గవి చేసిన పని సరికాదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆమె సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయబోయింది. కానీ ఆమె వాదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.