Adah Sharma : సినిమా ఆఫర్లు లేని చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం సోషల్ మీడియాపై పడ్డారు. అందులో తమ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తున్నారు. అయితే అంత వరకు బాగానే ఉంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం గ్లామర్ పేరిట అడ్డమైన డ్రెస్‌లను ధరిస్తున్నారు. అలాంటి వారిలో అదాశర్మ ముందుంటుందని చెప్పవచ్చు. ఈమె అప్పుడప్పుడూ ధరించే డ్రెస్‌లు వివాదాస్పదం అవుతుంటాయి. గతంలో ఈమె రన్నింగ్ కారు పక్కన డ్యాన్స్ చేసి అభాసుపాలైంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈమెకు క్లాస్ పీకారు. అయినప్పటికీ ఈమె తన పని తాను చేసుకుపోతుంది. కానీ అలా చేయడం మానడం లేదు.
ఇక తాజాగా అదాశర్మ లేత ఆకుపచ్చ, పసుపు రంగులో ఉన్న డ్రెస్‌ను ధరించింది. ఆ డ్రెస్ అదో మాదిరిగా ఉంది. ఈ క్రమంలోనే ఆ ఫొటోలను ఆమె షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. అయితే ఆమె ధరించిన డ్రెస్ మరీ ఎబ్బెట్టుగా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ డ్రెస్ ఏంటి.. ఆ అవతారం ఏంటి.. అని ఆమెను విమర్శిస్తున్నారు.
గ్లామరస్ డ్రెస్ ధరించావు సరే.. కాస్త బెటర్‌గా ఉండే డ్రెస్ ధరిస్తే ఏమొచ్చింది.. మరీ చండాలంగా ఉన్నావు.. అని అదాశర్మను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఇక అదాశర్మ టాలీవుడ్‌కు హార్ట్ ఎటాక్ అనే మూవీ ద్వారా పరిచయం కాగా.. తరువాత కూడా పలు సినిమాల్లోనూ నటించింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు లభించింది సెకండ్ హీరోయిన్ ఆఫర్లే. అలాగే తెలుగుతోపాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఈమె యాక్ట్ చేసింది. కానీ అవేవీ పెద్దగా హిట్ కాలేదు.
కాగా అదాశర్మ ప్రస్తుతం ఓ మార్షల్ ఆర్ట్స్ మూవీలో నటిస్తోంది. అందుకు గాను ఆమె విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటోంది. ఇక ఈమెకు ఇప్పటికే కర్రసాము, కరాటే లాంటి విద్యల్లో నైపుణ్యం ఉంది. దీంతో ఈమెకు ఇది ప్లస్ పాయింట్‌గా మారనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…