Neck Darkness : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి వాతావరణంలో మార్పుల వలన చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అలాగే కొందరికి శరీరం మొత్తం తెల్లగా ఉన్నా మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని మామూలుగా చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెడ భాగంలో ఉండే నలుపు పోదు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటించడం వల్ల మెడ భాగంలో ఉండే నలుపు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. మెడ నలుపు పోగొట్టుకోవడానికి రకరకాల క్రీమ్స్, ఇంటి చిట్కాలను ఉపయోగించి ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినట్లయితే ఒకసారి ఈ చిట్కాను ట్రై చేయండి. మెడపై నలుపు మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతుంది.
దీనికోసం ముందుగా ఎనిమిది బాదంపప్పులను రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే బాదం పప్పులపై పొట్టు తీసి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ మిల్క్ పౌడర్ ని కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగంపై అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
తర్వాత ఈ ప్యాక్ వేసిన భాగంలో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ వేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు, నాలుగు రోజులపాటు చేసినట్లయితే మీ మెడ నలుపు మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ చిట్కాను ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…