NBK107 : నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ షూటింగ్ కొనసాగుతున్న విషయం విదితమే. ఈ మూవీని ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుంచి పవర్‌ఫుల్ టీజర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఇందులో బాలకృష్ణ అదిరిపోయే ఊరమాస్ క్యారెక్టర్‌లో కనిపించారు. పలు పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతూ ఆశ్చర్యపరిచారు.
భయం అన్నది నా బయోడేటాలోనే లేదన్న బాలయ్య.. నరకడం మొదలు పెడితే పార్ట్‌లను చూసి పెళ్లాలే గుర్తు పట్టరు.. అని బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ టీజర్‌లో బాలకృష్ణ నల్లని దుస్తులు ధరించి నుదుటన బొట్టు పెట్టుకుని చుట్ట తాగుతూ మాస్ క్యారెక్టర్‌లో అలరించారు. ఇక ఈ సినిమాలో ఆయన ఓ ఊరి పెద్ద పాత్రలో కనిపించనున్నారని.. మైనింగ్ చుట్టూ నడిచే కథని తెలుస్తోంది. ఇందులో బాలయ్య భిన్నమైన గెటప్ లో అలరించనున్నారు. బాలయ్యకు జోడిగా ఇందులో శృతి హాసన్ నటిస్తోంది.

ఇక ఈ మూవీలో లేడీ విలన్ క్యారెక్టర్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. ఆమె గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాలోనూ విలన్‌గా నటించి అలరించారు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు విలన్‌గా పరిచయం అవుతున్నారు. ఇక ఈ మూవీకి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.