టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన్. కెరీర్ మొదట్లో చిన్నా చితకా పాత్రల్లో నటించినా.. ఇప్పుడు టాప్ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరిపోయింది. అంతేకాదు ప్రస్తుతం సౌత్ లోనే క్రేజీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ లేడీ సూపర్ స్టార్ నయనతార.
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అలియా, దీపికా పదుకునె కన్నా ఇప్పుడు నయన్ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటోందట. ఒక్కో సినిమాకి నయనతార రూ.10 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార.. ప్రస్తుతం పెళ్లి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరో వైపు సినిమాలలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే.. భర్త చేసిన ఓ పనికి నయనతార హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందని కోలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
వీకెండ్ కావడంతో నయన్ కు సర్ ప్రైజ్ గా ఓ స్పెషల్ వంటకం చేసి పెట్టాడట విగ్నేశ్. అది కాస్తా బెడిసికొట్టడంతో.. నయన్ కు ఫుల్ వాంతులు అవ్వడంతోపాటు స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందట వ్యవహారం. కొన్ని గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న నయనతారను ఆ తరువాత డిశ్చార్జ్ చేశారట. ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి విగ్నేశ్ అతి ప్రేమ నయన్ ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.