Nayanthara : లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఈ మధ్యే దర్శకుడు విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. జూన్ 9వ తేదీన వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. అయితే మాడ వీధుల్లో వీరు చెప్పులు వేసుకుని తిరగడం వివాదాస్పదం అయింది. దీంతో టీటీడీ వివరణ అడగ్గా.. వీరు క్షమాపణలు చెప్పారు. అయితే నయనతార ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండగా.. కనీసం పెళ్లి అయ్యాక అయినా.. ఈమె కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటుందని అనుకున్నారు. కానీ నయనతార మళ్లీ షూటింగ్‌లతో బిజీ కానుంది.
కొత్తగా పెళ్లయినప్పటికీ నయనతార సినిమాల నుంచి మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆమె ఇప్పటికే షారూక్ ఖాన్ మూవీలో నటించాల్సి ఉంది. అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. జవాన్ పేరిట ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మొదట సమంతను అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆమె నో చెప్పగా.. నయనతారను ఆమె ప్లేస్‌లో తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులో షారూక్ ఖాన్‌కు చెందిన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే నయనతార ఈ చిత్ర యూనిట్‌తో త్వరలో కలవనుంది.
ఇక చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలనూ నయనతార నటిస్తోంది. ఇందులో ఆయన చెల్లెలి పాత్రలో నయనతార నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజుల్లో ఈమె హైదరాబాద్‌కు వెళ్లనుందని సమాచారం. అయితే నయనతార తాను చేస్తున్న చిత్రాలకు చెందిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసుకుని ఆ తరువాత బ్రేక్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇంతకు ముందు సోనమ్‌కపూర్, కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే చేశారు. కనుక కొత్తగా పెళ్లయినప్పటికీ నయనతార మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదని స్పష్టం అవుతోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెనరా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెషలిస్ట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…