Nayanthara : దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్రతారగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ చిత్రం కోసం నయనతార ఏకంగా 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా అందుకు నిర్మాతలు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈమె అడిగినది ఇవ్వడానికి సిద్ధమయి ఆమెకు 4 కోట్ల రూపాయల చెక్ ఇచ్చారని సమాచారం.
అయితే ఇందులో నయనతార చిరంజీవి సరసన హీరోయిన్ గా కాకుండా ఈ చిత్రంలో ఆమె చిరుకి సోదరిగా నటిస్తున్నట్లు సమాచారం. కేవలం సోదరి పాత్రలో కనిపించడానికే నయనతార రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇప్పటివరకు తెలుగులో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే, రష్మిక వంటివారు కూడా 2 నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కానీ నయనతార మాత్రం ఏ హీరోయిన్ అందుకోని రెమ్యూనరేషన్ అందుకున్నారు.