Nayanthara : నయనతార, విఘ్నేశ్ దంపతులు సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు, దర్శకుడు విగ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లాడిన నయన్.. పెళ్లి జరిగి 4 నెలలు కూడా పూర్తి కాకముందే మగ కవల పిల్లలంటూ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఆడియన్స్ పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెప్పినప్పటికీ.. ఈ కవల పిల్లల మ్యాటర్ వెనుక సీక్రెట్స్ ఏంటి అనే కోణంలో చర్చించుకున్నారు.
దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మెడికల్ అడిషినల్ డైరెక్టర్ సారథ్యంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. ఈ కమిటీ వద్ద నయనతార తన సరోగసీ విధానానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించినట్టు తెలిసింది. ముఖ్యంగా.. తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం.
అలాగే గత డిసెంబరులో అద్దెగర్భం కోసం రిజిస్టర్ చేసుకుని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్ళు పూర్తి కావాల్సివుంది. భార్య వయస్సు 25 నుంచి 50 యేళ్ళలోపు, భర్త వయస్సు 26 నుంచి 55 యేళ్ళలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. నయనతార ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని విచారణ కమిటీకి ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. మరి ఈ సరోగసి వ్యవహారం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…