Nayanthara : గత కొన్నేళ్లుగా హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలసి విహారయాత్రలకు వెళ్లడం, కలసి పండుగలు జరుపుకోవడం వంటివి చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఆ మధ్య షిర్డీతోపాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. అయితే వీరి పెళ్లి గురించి ఎప్పటి నుండో ప్రచారాలు నడుస్తున్నా దానిపై స్పందించడం లేదు.
ఇటీవల నయనతార.. విఘ్నేష్ శివన్‌తో నిశ్చితార్థం జరుపుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నయన్ చెప్పింది. ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారు అనుకుంటున్న సమయంలో ఆమె జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
2022లో విఘ్నేష్ – నయన్ వివాహం జరగనున్నట్టు టాక్. ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార నేడు (నవంబర్18న) 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. అర్థర్రాతి నుంచే చెన్నైలో నయనతార బర్త్‌డే సంబరాలు షురూ అయ్యాయి. సరిగ్గా గడియారం 12 కొట్టంగానే విక్కీ నయన్‌తో కేక్ కట్ చేయించి క్రాకర్స్ పేల్చి సందడి చేశాడు.
ఈ పార్టీకి విక్కి, నయన్ కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. సమంత కూడా నయన్ బర్త్ డే పార్టీలో సందడి చేసింది. ఇక విఘ్నేష్ శివన్ తన ప్రేయసిని కౌగిలిలో బంధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక నయన్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలో ఆమె పోషించిన ‘కణ్మణి’ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిని ఇన్‌స్టాలో పంచుకుని తన ప్రియురాలికి బర్త్‌డే విషెస్ చెప్పుకొచ్చాడు విఘ్నేష్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…