Mega Heroes : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది మెగా హీరోలున్నారు. టాలీవుడ్ లో విడుదలయ్యే సినిమాల్లో దాదాపుగా మెగా హీరోలవే ఎక్కువగా ఉంటాయి. వీరంతా తమ సినిమాలను చాలా చక్కని ప్లానింగ్ తో షెడ్యూల్ చేసుకుంటారు. మెగా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇస్తూ.. మెగా అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తుంటారు. టాలీవుడ్ లో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో నలుగురు మెగా హీరోల సినిమాలు రిలీజవ్వడం గమనార్హం.
డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గనీ సినిమా కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతోంది. క్రిస్మస్ స్పెషల్ గా 24న రిలీజ్ అవుతోంది.
అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కొన్ని రోజుల తేడాతో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా భీమ్లా నాయక్ జనవరి 12న రిలీజ్ కు ఫిల్మ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాక 5 రోజుల తేడాతో భీమ్లా నాయక్ రిలీజ్ అవ్వడం అంటే మెగా అభిమానులకు పండగే.
ఏది ఏమైనా నెల రోజుల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఇక ఇదే నెల రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకష్ణ నటించిన అఖండ, నాని శ్యామ్ సింగ రాయ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలు కూడా రిలీజ్ అవనున్నాయి. దీంతో సినీ ప్రేక్షకులకు డిసెంబర్, జనవరి నెలల్లో అద్భుతమైన వినోదాన్ని పంచనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…