Natraj Master : బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మంచి ఆదరణ పొందిన నటరాజ్ మాస్టర్ తండ్రి ప్రమోషన్ అందుకున్నాడు. బిగ్ బాస్ షోకు వెళ్లేముందు నటరాజ్ మాస్టర్ భార్య ఏడు నెలల గర్భవతి. ఆ సమయంలో స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యాడు. పుట్టబోయే బిడ్డను నా చేతుల్తో ఎత్తుకుంటానో లేదో అని బాధపడ్డాడు. ఇంట్లో ఉన్న సమయంలోనూ భార్య గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
హౌజ్‌లో ఉన్న సమయంలో తన భార్య శ్రీమంతం వేడుక చూసి మురిసిపోయాడు. అయితే అనూహ్యంగా ఐదో వారానికే ఆయన బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండడం, అనుకున్నట్లే ఆడపిల్ల పుట్టడంతో నటరాజ్ మాస్టర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నటరాజ్ మాస్టర్ కోసం స్పెషల్ గా ఓ వీడియోను చూపించాడు బిగ్ బాస్. ఆయన భార్య సీమంతం వేడుకలకు సంబంధించిన వీడియోను ప్లే చేసి చూపించడంతో నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.
https://www.instagram.com/p/CWYvHAdDsOH/
నటరాజ్ మాస్టర్ కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ నటరాజ్ ఎమోషనల్ అయ్యాడు. తనకు అమ్మాయియే కావాలని కోరుకున్నానని, అనుకున్నట్లే పాప పుట్టిందని మురిసిపోయాడు. బుధవారం అర్థరాత్రి లోబోతో కలిసి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన నటరాజ్.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.
తనకు, తన బిడ్డకు అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నాడు. దేవుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఏమీ ఇవ్వకున్నా.. బయట పండంటి బిడ్డని ఇచ్చాడంటూ ఎమోషనల్ అయ్యాడు.