Nani : చూడడానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని తన ప్రతి సినిమాతో అభిమానుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. అయితే ఇటీవలి కాలంలో నానికి సక్సెస్ అనేది అందని ద్రాక్షగా మారింది. ఒకవైపు ఆయన సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయనే విమర్శలు, మరోవైపు చిత్రాలు సరైన సక్సెస్‌లు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లలో రెండు సినిమాలను విడుదల చేసిన నాని.. శ్యామ్ సింగ రాయ్ అంటూ థియేటర్లలో పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. దాని తరువాత మరో ప్రాజెక్ట్‌ను రెడీ చేశాడు. అంటే సుందరానికీ ! ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇది వరకే వచ్చింది. వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్‌ని అందించనున్నట్టుగా తెలుస్తోంది.
తాజాగా నాని 29వ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దసరా అనే టైటిల్‌తో నాని 29వ చిత్రం తెరకెక్కనుండగా, ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. పోస్టర్‌లో రగ్డ్ లుక్‌తో ఉన్న నాని కనిపిస్తుండగా, ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. పోస్టర్ చూస్తుంటే నాని ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. మరి ఈ మూవీతో అయినా నాని ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో, లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…