Fact Check : డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసిన కోర్టు నిర్ణయాన్ని వెలువరించేందుకు ఈ నెల 20వ తేదీ వరకు వాయిదా వేసింది. దీంతో ఆర్యన్ ఖాన్ మరో 6 రోజుల పాటు జైలులోనే ఉండనున్నాడు. అయితే ఆర్యన్ ఖాన్ గురించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె.. ఆర్యన్ ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టాడనే వార్త వైరల్ గా మారింది. షారూఖ్ ఖాన్ తన కుమారున్ని పరామర్శించేందుకు సమీర్‌కు ఫోన్ చేయగా.. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన సమీర్.. హోల్డ్ లో ఉండమని చెప్పి.. ఆర్యన్‌ను పిలిచి.. షారూఖ్ వింటుండగానే.. ఆర్యన్‌ను చెంప దెబ్బ కొట్టాడని.. తరువాత క్రమశిక్షణతో నడుచుకుని ఉంటే మీ కొడుకు ఇలా ఉండాల్సి వచ్చేది కాదని.. షారూఖ్‌కు చెప్పాడట.. ఇలా ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది.
అయితే దీనిపై సమీర్ స్పందించారు. తాను ఆర్యన్ ఖాన్ ను చెంప దెబ్బ కొట్టానని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలను నమ్మకూడదని అన్నారు. అయితే జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కేవలం బిస్కెట్లు తప్ప ఏమీ తినడం లేదని.. అతని తల్లి గౌరీ ఖాన్ తీవ్రంగా దుఃఖిస్తుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారూఖ్‌కు తెచ్చిన తలనొప్పులు అన్నీ ఇన్నీ కావనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…