Nagarjuna : గతేడాది అక్టోబర్‌లో అక్కినేని నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నట్లు తమ తమ సోషల్ ఖాతాల ద్వారా వేర్వేరుగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. వీరు ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కలసి మెలసి అన్యోన్యంగా ఉన్నారు. అలాంటిది విడాకులు ఎందుకు తీసుకుంటున్నారబ్బా.. అని ఫ్యాన్స్ తలలో మొలకలు మొలిచేలా ఆలోచించారు. కానీ ఇప్పటి వరకు వీరి విడాకులకు కారణాలు ఏమిటన్నది తెలియలేదు. అయితే కొన్ని కారణాలు మాత్రం ఉన్నాయంటూ.. వార్తలు వచ్చాయి. సమంత సినిమాలు, సిరీస్‌లలో అలా నటించడం ఇష్టం లేకే కుటుంబం ఒత్తిడి మేరకు నాగచైతన్య విడాకులు ఇచ్చాడని.. అసలు సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదని.. అందుకనే విడాకులు ఇచ్చిందని.. ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. కానీ వీటిని అక్కినేని కుటుంబం, సమంత లేదా ఆమె కుటుంబం ఖండించలేదు. అలాగని విడాకులకు కారణాలు కూడా చెప్పలేదు. అయితే తాజాగా వీరి గురించి ఇంకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..
అక్కినేని నాగార్జున త్వరలోనే నాగచైతన్య, సమంతలను కలపబోతున్నారట. ఈ క్రమంలోనే ఆయన సమంత తల్లిదండ్రులను కలిసి మాట్లాడారట. అయితే వారు సుముఖంగానే ఉన్నారట. దీంతో చైతూ, సమంతలను త్వరలో నాగ్ కలుపుతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇది. కనుక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే సమంత, చైతూ కలవడం అన్నది దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో సెలబ్రిటీ జంటలు విడిపోయాక ఎవరి దారు వారు చూసుకుని కొత్త జీవిత భాగస్వాములను వెతుక్కున్నారే తప్ప.. ఇలా విడిపోయి మళ్లీ కలసిన సెలబ్రిటీలు చాలా అరుదుగానే ఉన్నారనే చెప్పాలి. అయితే ఏమో.. సమంత, చైతూల విషయంలో మిరాకిల్ జరగవచ్చు. వారు కలవనూ వచ్చు. కనుక అలాంటి సమయం వస్తుందా.. అని వేచి చూడాల్సిందే.

ఇక విడాకుల ప్రకటన అనంతరం సమంత గ్లామర్ షో పెంచడమే కాకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండతో కలసి నటించనున్న ఖుషి అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అప్పట్లో వచ్చిన పవన్ కల్యాణ్ మూవీ ఖుషియే. ఆ టైటిల్‌నే ఇప్పుడు విజయ్, సమంతల సినిమాకు వాడుతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.