Vaishnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వచ్చినా కూడా మంచి సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రీసెంట్‌గా కొండ పొలం చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇందులో ఓబులమ్మగా రకుల్ కనిపించింది. కటారి రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించి మెప్పించాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా కొండపొలం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్.
నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బీటెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. బీటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు.. వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు. వాటిని ఆధారంగా చేసుకొని క్రిష్ చిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్రం అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మించారు.
అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమాపై మరిన్నిఅంచనాలు పెంచేందుకు బిగ్ బాస్ షోకి హాజరైంది చిత్ర బృందం. క్రిష్, వైష్ణవ్ తేజ్ బిగ్ బాస్ షోకి హాజరు కాగా వారు నాగార్జునతో కలిసి సందడి చేశారు. ఇంత చిన్న వయస్సులో రకుల్‌ని ఎలా ప్రేమించావు అని నాగార్జున ప్రశ్నించగా, దానికి తప్పలేదు అని చెప్పాడు. ఇక క్రిష్ తను హమీదా కోసం ఏదైనా చేసే వాడిని అన్నాడు. మీరు 45 రోజులు అడవులలో షూట్ చేస్తే మా వాళ్లు 105 రోజులు ఇక్కడ ఉండనున్నారని నాగార్జున అన్నారు. నేటి షో సందడిగా సాగనున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…