Nagarjuna : అక్కినేని నాగార్జున ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అగ్ర హీరోల్లో నాగార్జున చేసినట్లు వేగంగా సినిమాలు ఎవరూ చేయడం లేదనే చెప్పవచ్చు. ఒక మూవీ అవగానే ఆయన మరో మూవీని వెంటనే చేస్తున్నారు. ఇక ఇటీవలే ఆయన నటించిన బంగార్రాజు మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ది ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున సరసన కథానాయికగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఈ సినిమాను నారాయణ్ కె దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ సినిమాకు గాను దుబాయ్‌లో 15 రోజుల పాటు పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల్లో నాగార్జునతోపాటు సోనాల్ చౌహాన్ కూడా పాల్గొననుంది.
దుబాయ్‌లో జరగనున్న షూటింగ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన స్టంట్ డైరెక్టర్ సీలుమ్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. దుబాయ్‌లో గతంలో సాహో సినిమాకు చెందిన యాక్షన్ సన్నివేశాలను తీశారు. ఇప్పుడు ది ఘోస్ట్ యాక్షన్ సీన్లను తీయనున్నారు.
ఇక ది ఘోస్ట్ మూవీలో నాగార్జున మాజీ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తగినట్లుగా ఇందులో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రా ఏజెంట్‌గా ఉన్న సమయంలో ఒకలా, మాజీ ఏజెంట్‌లా మరొక లుక్‌లో ఇందులో నాగార్జున కనిపించనున్నారట. దీంతో ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.