Nagababu : తన కుమార్తె నిహారిక వ్యవహారం ఏమోగానీ.. మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు చిన్న విషయాలకే ఆయన స్పందించేవారు. వారు అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అంటూ చెప్పేవారు. ఓ వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరోవైపు సినిమాలు, టీవీ షోలు చేసేవారు. అయితే కొంత కాలం కిందట ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఇకపై తన జీవితం ప్రజా సేవకే అంకితమని చెప్పారు. దీంతో ఆయన సినిమాలు, టీవీ షోలను వదిలేసి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానున్నారా ? అయితే ఆయన ఎప్పటి నుంచి అలా చేస్తారు ? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. అందుకు ఆయన ధరించిన తాజా గెటప్పే కారణమని చెప్పవచ్చు.
నాగబాబు అంటే మనకు చాలా స్టైలిష్‌గా కనబడే వ్యక్తి. పెళ్లికి ఎదిగిన కుమారుడు, పెళ్లయిన కుమార్తె ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన యంగ్‌గానే కనిపిస్తారు. స్టైలిష్ గా ఉంటారు. కానీ ఆయన తాజా లుక్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అందులో ఆయన భిన్నంగా కనిపించారు. వైట్ అండ్ వైట్ దుస్తుల్లో.. తెల్లని గడ్డం, మీసాలు.. కళ్లకు అద్దాలు.. ఇలా ఆయన పక్కా రాజకీయ నేతగా మారారు. ఈ క్రమంలోనే ఆయన రానున్న రోజుల్లో రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైనప్పటి నుంచి నాగబాబు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈమధ్య కాబోలు.. పార్టీ వేడుకల్లో ఆయన పవన్‌తో కలిసి సందడి చేశారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నారనే అనుమానాలు ఏర్పడ్డాయి. వాటికి బలం కలిగేలా ఆయన తాజా తన లుక్‌ను కూడా పొలిటికల్ లీడర్‌లా మార్చేశారు. దీంతో నేడో రేపో ఆయన మీడియా ముందుకు వస్తారని కూడా అంటున్నారు.
ఇక నాగబాబు కూడా జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. కానీ అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. కానీ టీవీ షోలు, సినిమాలకు మాత్రం పూర్తి సమయం కేటాయించారు. ఇటీవల ఆయన విడుదల చేసిన లేఖతో ఆయన ఇక రాజకీయాలకే అంకితమవుతారనే విషయం స్పష్టమైంది. మరి నాగబాబు రాజకీయాల కోసమే తన లుక్‌ను ఇలా మార్చారా.. లేదా.. అందుకు వేరే ఏదైనా కారణం ఉందా.. అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…