IPL 2022 : ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 టోర్నీ 33వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి వరకు ముంబైనే గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివరి బంతికి ధోనీ ఫోర్ కొట్టాడు. దీంతో విజయం చెన్నైని వరించింది. ఫలితంగా ముంబైపై చెన్నై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో 51 పరుగులతో తిలక్ వర్మ ఒక్కడే ఆకట్టుకున్నాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి 3 వికెట్లు పడగొట్టగా.. డ్వానె బ్రేవో 2 వికెట్లు తీశాడు. అలాగే మిచెల్ శాన్టనర్, మనీష్ తీక్షణలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. వికెట్లను వరుసగా కోల్పోతూ వచ్చింది. దీంతో ముంబై గెలుస్తుందని భావించారు. కానీ చివర్లో వచ్చిన ధోనీ మెరుపులు మెరిపించడంతో జట్టుకు విజయం ఖాయమైంది. ఈ క్రమంలోనే చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో అంబటి రాయుడు 40 పరుగులతో ఆకట్టుకోగా.. రాబిన్ ఊతప్ప 30 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ఇక ముంబై బౌలర్లలో డానియెల్ శామ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనడ్కట్‌కు 2, మెరెడిత్‌కు 1 వికెట్ దక్కాయి. ఇక ఈ మ్యాచ్‌లో కూడా ఓటమితో ముంబై వరుసగా 7 ఓటముల పాలు అయినట్లు అయింది. ఈ సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో ఇంకా ఖాతా తెరవనే లేదు. ఇక చెన్నై పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఇప్పటికే ఒక మ్యాచ్ లో గెలుపొందిన చెన్నైకి ఇది ఈ సీజన్‌లో రెండో విజయం. కాగా ఈ జట్టు ప్లేయర్లు ఈ విజయంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. మరి చెన్నై పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…