Naga Chaithanya : విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత అటు నాగచైతన్య, ఇటు సమంత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. అయితే విడిపోయాక కూడా స్నేహితుల్లా కలసి ఉంటామన్న ఈ జంట మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం విశేషం. ఒకరి సినిమాలకు ఒకరు బెస్టాఫ్ లక్ చెప్పుకోవడం లేదు, ఒకరి బర్త్‌డేకు ఒకరు విషెస్ చెప్పుకోవడం లేదు. ఇది అటుంచితే.. తాజాగా నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. తన విడాకుల విషయంపై తాను ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదని.. ఎందుకంటే అది తన కుటుంబంపై నెగెటివ్ ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం తనకు తన ఫ్యామిలీ చాలా ముఖ్యమని అన్నాడు.
తాను ఏదైనా కామెంట్ చేస్తే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారని.. అది తనకు నచ్చదని.. పండ్లు ఉండే చెట్టుకే రాళ్లు వేస్తారు కదా.. అని చైతన్య అన్నాడు. తన కుటుంబం గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది తనను ఎక్కువ ఇబ్బందులకు గురిచేస్తుందని, కనక తన విడాకుల విషయంలో ఇకపై మాట్లాడదలచుకోలేదని తెలిపాడు.
కాగా నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకోగా.. త్వరలో చైతూ లాల్ సింగ్ చడ్డా అనే బాలీవుడ్ మూవీలో కనిపించనున్నాడు. ఇందులో అమీర్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…