Naga Chaithanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా కొనసాగుతున్న వారిలో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఒకటి. వీరు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగు సంవత్సరాల వీరి వైవాహిక జీవితంలో పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే సమంతని నాగ చైతన్య పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని తెలుస్తోంది.
నాగచైతన్య తల్లి శ్రీలక్ష్మి చెన్నైలో నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చెన్నైలో తన తల్లిని చూడటం కోసం నాగచైతన్య తరచూ అక్కడికి వెళ్లేవారు. ఆ సమయంలోనే తన తల్లి ఇంటి పక్కన సమంత అనే పేరు ఉండే ఒక అమ్మాయి ఉండేదట. అయితే ఆమెను చూడగానే ఇష్టపడ్డ నాగచైతన్య ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడట. కానీ ఆమె అతని లవ్‌ను తిరస్కరించిందట.
ఇక ఇదే విషయాన్ని నాగచైతన్య తన తల్లి దగ్గర చెప్పుకుని వాపోయాడట. లవ్ ఫెయిల్యూర్ సహజమే అని ఆమె సర్ది చెప్పిందట. అయితే తరువాత హీరోయిన్ సమంత ఏం మాయ చేశావేతో చైతూకు పరిచయం అయింది. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.
ఈ క్రమంలో ఇదే విషయాన్ని తన తల్లి దగ్గర చెప్పడంతో.. సమంత అనే పేరుండే అమ్మాయి తిరస్కరించింది కదా.. కేవలం సమంత అన్న పేరు ఉండటం వల్ల ఈ హీరోయిన్‌ను ప్రేమించావా.. అని అడగడంతో.. పేరు మాత్రమే కాదు, తను కూడా నచ్చడంతో తనని ప్రేమించానని.. నాగచైతన్య చెప్పాడట. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అయితే మొదటగా పరిచయం అయిన సమంత అనే పేరున్న అమ్మాయి.. నాగచైతన్యను ఎలా రిజెక్ట్ చేసిందో.. ఇప్పుడు హీరోయిన్ సమంత కూడా నాగచైతన్యతో అదేవిధంగా తెగతెంపులు చేసుకుంది. దీంతో చైతూకు అసలు ఈ పేరు అచ్చిరాలేదని అంటున్నారు. కేవలం తాను మొదట ప్రేమించిన అమ్మాయి పేరు ఈ సమంతకు ఉండడంతోనే ఈ సమంతను నాగచైతన్య ప్రేమించాడని తెలుస్తోంది. అయినా అతనికి అదృష్టం కలసి రాలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…