Naga Chaithanya : అఖిల్, పూజా హెగ్డెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. తన తొలి చిత్రం బొమ్మరిల్లు హిట్ కావడంతో భాస్కర్ కు ఆ చిత్రం పేరు ఇంటి పేరు అయింది. దీంతో బొమ్మరిల్లు భాస్కర్ అని పేరు మార్చుకున్నాడు. ఇక భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
ఈ మూవీకి గాను శుక్రవారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య కూడా హాజరయ్యాడు. ఈ సందర్బంగా తన సోదరుడి చిత్రంపై నాగచైతన్య మాట్లాడారు.
అఖిల్ చాలా కష్టపడతాడని నాగచైతన్య తెలిపారు. ఈ మూవీ అఖిల్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అఖిల్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఫ్యూచర్‌ను ప్లాన్ చేసుకుంటాడని అన్నారు. వచ్చే 5-6 సంవత్సరాల కాలంలో అఖిల్ పక్కా ప్లానింగ్‌తో మూవీల విషయంలో ముందుకు సాగుతున్నాడని తెలిపారు.
అయితే అఖిల్ ఇంతటి పెద్దవాడైనా తన కళ్లకు ఇంకా సిసింద్రీ లాగే కనిపిస్తాడని నాగచైతన్య అన్నారు. సిసింద్రీలా ఉన్నప్పటి దృశ్యాలే తన కళ్ల ముందు ఇంకా తిరుగుతున్నాయని అన్నారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్లను బాగానే రాబడుతోంది. ఇప్పటికీ సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేశాయని, ఇక వచ్చేదంతా లాభమే అనే టాక్ నడుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…