Samantha : నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత సమంతనే అందరూ టార్గెట్ చేసిన విషయం విదితమే. నాగచైతన్య సౌమ్యుడని.. అంతా సమంతే చేసిందని.. ఆమె చేసిన పనుల వల్లే చైతూ ఆమెకు విడాకులు ఇచ్చాడని.. పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే సమంత తాజాగా ఇలాంటి విమర్శలపై పోస్ట్ కూడా పెట్టింది.
తనపై వస్తున్న విమర్శలు, దుష్ప్రచారాన్ని ఆపాలని సమంత ఒక సోషల్ పోస్ట్ ద్వారా కోరింది. అయితే సమంతకు కూడా చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. అయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ ముందు సమంత ఫ్యాన్స్ తక్కువే. దీంతో ఆమెపై వస్తున్న విమర్శలు ఆగడం లేదు.
అయితే తనపై వస్తున్న ట్రోల్స్, విమర్శలు, దుష్ప్రచారానికి చెక్ పెట్టేలా సమంత ప్రెస్ మీట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా విమర్శలు ఇలాగే కొనసాగితే తన భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కనుక.. అసలు విషయం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో సమంత ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే సమంత ఒక వేళ నిజంగానే ప్రెస్ మీట్ పెడితే ఏ విషయాలు చెబుతుంది ? ఆమెను జర్నలిస్టులు ఏం ప్రశ్నిస్తారు ? అందుకు ఆమె బదులివ్వగలదా ? ఇచ్చినా మళ్లీ ఏమైనా సస్పెన్స్ లో పెడుతుందా ? లేక సమంతను అభిమానించే వారు చెబుతున్నట్లు.. అక్కినేని ఫ్యామిలీయే ఆమెను టార్చర్ చేసి ఉంటే.. వాటిని సమంత ప్రెస్ మీట్‌లో బయట పెడుతుందా ? ఆమె అంతటి సాహసం చేస్తుందా ? అనే.. ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే సమంత నిజంగానే ప్రెస్ మీట్ పెడితే ఆమె సాహసం చేస్తుందనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…