Naga Chaitanya : విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.. నాగచైతన్య, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. థాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇక రాశి ఖన్నా, నాగచైతన్యలతోపాటు ఇందులో నటించిన మాళవికా నాయర్, అవికా గోర్‌లు చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వారు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇక తాజాగా చైతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
థాంక్ యూ చిత్ర ప్రమోషన్లలో భాగంగా చైతన్య మాట్లాడుతూ.. తాను జీవితంలో ముగ్గురు వ్యక్తులకు థాంక్స్ చెబుదామని అనుకుంటున్నానని అన్నాడు. మొదట తన తల్లికి థాంక్స్ చెప్పాడు. ఆమె చిన్నప్పటి నుంచి తనను ఎంతో ప్రేమగా చూసుకుంటూ పెంచిందని తెలిపాడు. తనకు అంతులేని ప్రేమను పంచిందన్నాడు. అందువల్ల ఆమెకు థాంక్‌యూ చెబుతున్నానని అన్నాడు. ఇక తన తండ్రి కూడా తన ఆలనా పాలనా చూశారని.. ఆయన తన ఫ్రెండ్‌లా తనను భావిస్తారని చైతూ తెలిపాడు. కనుక నాగార్జునకు థాంక్స్ చెబుతున్నానని అన్నాడు.
ఇక మూడోది వ్యక్తి కాదు.. కుక్క పిల్ల. అవును.. అది సమంత దగ్గర ఉండేది. దాన్ని ఆమెనే అప్పట్లో తీసుకువచ్చింది. దాని పేరు హష్. హష్ అంటే తనకు ప్రాణమని.. తన వెనుకనే తిరిగేదని.. సొంత మనిషిలా చూసుకునేదని నాగచైతన్య ఎమోషనల్ అయ్యాడు. దానికి కూడా థ్యాంక్స్ చెబుతున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు హష్ చైతూ దగ్గర లేదు. సమంతతో విడిపోయాక ఆమె తన కుక్కను తాను తీసుకెళ్లింది. ఇక ఆమె దగ్గర హష్‌తోపాటు సాషా అనే ఇంకో కుక్క పిల్ల కూడా ఉంది. అయితే సమంత దగ్గర ఉన్న కుక్క పిల్లను తలచుకుని చైతూ ఎమోషనల్ అవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. చూస్తుంటే సమంత కన్నా హష్‌తోనే చైతూకు అనుబంధం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…