Naga Chaitanya : సమంత, నాగచైతన్య విడిపోయాక.. చైతూ గురించి ఎక్కువ పుకార్లు రాలేదు. కానీ సమంతపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమె సినిమాలు.. సిరీస్‌లలో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తుందని.. చెప్పినా వినడం లేదనే.. ఆమెకు చైతన్య విడాకులు ఇచ్చాడని వార్తలు ప్రచారం అయ్యాయి. అలాగే సమంత పిల్లలు వద్దనుకుందని.. అబార్షన్ చేయించుకోవాలని అనుకుందని.. కనుక ఆమె వ్యవహార శైలి నచ్చని అక్కినేని ఫ్యామిలీ విడాకులు ఇవ్వాలని చైతూపై ఒత్తిడి తెచ్చారని.. కనుకనే అతను ఆమెకు విడాకులు ఇచ్చాడని.. వార్తలు వచ్చాయి. అయితే వారు విడాకులు ఎందుకు తీసుకున్నారు.. అనే విషయం ఇప్పటికీ తెలియదు. అయితే తాజాగా ఇంకో వార్త బాగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..

నాగచైతన్య.. సమంతకు విడాకులు ఇచ్చాక అతనికి తండ్రి నాగార్జున వేరే సంబంధాలు చూస్తున్నారని.. ఓ స్టార్ హీరోయిన్‌తో చైతూ పెళ్లి నిశ్చయం అయిపోయిందని.. అలాగే అఖిల్ కు కూడా సంబంధం చూశారని.. కనుక ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తారనే వార్త ప్రచారం అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉందనే విషయం తెలియదు. కానీ సోషల్ మీడియాలో దీని గురించి బాగా ప్రచారం చేస్తున్నారు. గతంలో చైతూ, అఖిల్.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ అఖిల్ పెళ్లి జరగలేదు. తరువాత సమంత, చైతూ వివాహం చేసుకున్నారు. ఇక వారు విడిపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చైతన్య, అఖిల్‌కు పెళ్లి సంబంధాలు నిశ్చయం అయిపోయాయని.. త్వరలోనే వీరికి వివాహం జరిపిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇక నాగచైతన్య ఈ మధ్యే థాంక్ యూ అనే సినిమాను పూర్తి చేయగా.. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. అలాగే అఖిల్ ఏజెంట్ అనే సినిమాతో ముందుకు రానున్నాడు. సమంత కాతు వాకుల రెండు కాదల్ అనే మూవీతో సందడి చేయనుంది. ఆగస్టులో యశోద అనే సినిమాతోనూ సమంత ప్రేక్షకులను అలరించనుంది.