Naga Chaitanya : దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. ఇందులో రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికాగోర్‌లు కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. టాక్ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు మాత్రం ఆసక్తిని చూపించలేదు. దీంతో మూవీ డిజాస్టర్ అయింది. అయితే నాగచైతన్య త్వరలోనే మళ్లీ ఇంకో మూవీతో మన ముందుకు రానున్నాడు. ఆయన నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ సినిమా ఆగస్టు 11న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే చైతన్య ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రస్తుతం పాల్గొంటున్నాడు.
ఇక తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతూ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నాగ చైతన్య తొలిసారిగా హిందీ మూవీలో నటిస్తున్నాడు. ఆయన నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదే. దీంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సమంత గురించి కొన్ని ప్రశ్నలు చైతూకు ఎదురయ్యాయి. దీంతో చైతూ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు.

సమంతతో విడాకుల గురించి చైతన్య మాట్లాడుతూ.. మేమిద్దరం ఏం చెప్పాలనుకున్నామో అది ఆల్రెడీ చెప్పేశాం. నా లైఫ్ లో మంచి అయినా చెడు అయినా మీడియాకు చెప్పే ముందుకు వెళతాను. విడాకుల తర్వాత సమంత బిజీ అయిపోయింది. నా పని నేను చేసుకుంటున్నా. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమే అని నాగ చైతన్య తెలిపాడు. మీడియాకి చెప్పాల్సింది చెప్పాం.. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి విషయం తెలుసు. అంతకి మించి మాట్లాడాల్సింది ఏమీ లేదు.. అని చైతూ తెలిపాడు. ఓ జాతీయ మీడియా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య ఈ విధంగా స్పందించాడు. ఈ క్రమంలోనే ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే చైతన్య, సమంత ఎందుకు విడిపోయారనే విషయం ఆయన కుటుంబం, ఫ్రెండ్స్ సర్కిల్‌లో అందరికీ ముందే తెలుసన్న విషయం మాత్రం స్పష్టమైపోయింది. అంటే.. అందరితోనూ మాట్లాడే వారు ఆ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. అయితే ఆ విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. వారు అసలు ఎందుకు విడిపోయారనే విషయాన్ని ఇంకా చెప్పలేదు. మరి రానున్న రోజుల్లో అయినా ఈ విషయం బయట పడుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక నాగ చైతన్య ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అలాగే త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించబోతున్నాడు. సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ తో కూడా ఒక చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.