Aryan Khan : డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్ ఖాన్‌కు కోర్టు షాకిచ్చింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు విచారించి విచారణను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇస్తుందని అంతా భావించారు. ఈ మేరకు ఆర్యన్ ఖాన్ తండ్రి షారూఖ్ ఖాన్, ఆయన తరఫున లాయర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఎన్‌సీబీ అధికారులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు మరోమారు నిరాకరించింది.
ఆర్యన్‌ఖాన్ ఇప్పటికే బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్ పెట్టుకున్నా.. అతను బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయన్న ఎన్‌సీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో మరోసారి అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు విచారణను బుధవారంకు వాయిదా వేసింది. అయితే ఆఖరి నిమిషంలో బెయిల్ వస్తుందనే అంతా అనుకున్నారు. కానీ ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్‌కు చెందిన పలు కీలక వాట్సాప్ చాట్‌లను కోర్టు ఎదుట ఉంచారు.
షిప్‌లో అందరూ డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో ఓ ప్రముఖ ఔత్సాహిక బాలీవుడ్ హీరోయిన్‌కు ఆర్యన్ ఖాన్ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపాడు. అతను చాలా సేపు ఆ సమయంలో ఆమెతో చాట్ చేశాడు. ఆ చాట్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంది. వాటిని బట్టి అతను డ్రగ్స్‌ను అందరికీ సరఫరా చేస్తాడని.. ఎన్‌సీబీ ధ్రువీకరించింది. ఆ చాట్‌లకు చెందిన పత్రాలను ఎన్‌సీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కేసు మరీ బలంగా ఉందని భావించిన న్యాయస్థానం ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అతనితోపాటు మరో ఇద్దరికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో అతనికి మరిన్ని రోజుల పాటు కస్టడీ ఇవ్వనుంది.
కాగా కోర్టులో విచారణలు ముగిసిన వెంటనే అధికారులు ఆర్యన్‌ను మళ్లీ జైలుకు పంపించారు. దీంతో ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈరోజు కచ్చితంగా బెయిల్ వస్తుందనుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఎన్‌సీబీ కీలక ఆధారాలను సమర్పించడంతో వచ్చే బెయిల్ రాకుండా పోయింది. దీంతో షారూఖ్‌కు మళ్లీ విచారం తప్పడం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…