Multiplex : ఒకప్పుడు ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్.. సినిమా ప్రేక్షకులతో ఎంత సందడిగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద సినిమా విడుదల అవుతుంది అంటే ఆ ప్రాంతాలన్నీ కళకళలాడుతుంటాయి. సినిమా హీరోలు కూడా తొలి రోజు అక్కడికి వచ్చి అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపేవాళ్లు. కానీ సింగిల్ స్క్రీన్ హబ్ అయిన ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ నెమ్మదిగా మల్టీప్లెక్స్ హబ్ గా మారుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మునుముందు తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల సింగిల్ థియేటర్లు కనుమరుగై ఆ స్థానాల్లో మల్టీప్లెక్సులు మొదలవుతాయన్నట్లుగా అనిపిస్తోంది. ఏషియన్ వారు పలువురు హీరోలతో కలిసి అనేక చోట్ల మల్టీ ప్లెక్స్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు AMB సినిమాస్.. విజయ్ దేవరకొండ AVD సినిమాస్.. ని ఇప్పటికే లాంచ్ చేశారు. త్వరలో అల్లు అర్జున్ AAA సినిమాస్ ని ఏషియన్ సినిమాస్ సంస్థ భాగస్వామ్యంలో నిర్మించింది.
బన్ని సొంత మల్టీ ప్లెక్స్ ను అమీర్ పేట్ లో త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇక మరో ఐకానిక్ థియేటర్ గా AMB విక్టరీ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు ఏషియన్ సినిమాస్ సంస్థ సన్నాహకాల్లో ఉన్నారని సమాచారం. మహేష్ బాబు, రానా, వెంకటేష్‌లతో ఏషియన్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ కొత్త మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తుండగా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ స్థలంను ఓ భారీ మాల్‌గా రూపొందించనున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…