Sai Dharam Tej : ప్రస్తుతం ఉన్న హైటెక్ టెక్నాలజీ వల్ల కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి కూడా అదే రేంజ్ లో ఉంది. సామాన్య ప్రజలు కనుక కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళ ముత్తాతల ఆస్తులు కూడా రాయించేసుకుంటారు. అలాగే సెలబ్రిటీల విషయంలో ఎలా ఉంటుందనేది ఇంకా సస్పెన్స్. లేటెస్ట్ గా బైక్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలి హాస్పిటల్ లో చేరిన సాయి ధరమ్ తేజ్ 36 రోజులు ఉన్నారు. అయితే సాయి తేజ్ కి ఎంత బిల్ వేసారనే విషయం ఇప్పటి వరకు తెలీదు. సెప్టెంబర్ 10 నుండి సాయి తేజ్ హాస్పిటల్‌లో ఉండగా.. అక్టోబర్ 15వ తేదీన అతని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
దాదాపు యాక్సిడెంట్ జరిగిన 10 రోజులు అసలు సాయి తేజ్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఎవరికీ తెలీదు. సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్ళాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి రోజు వైద్యులు సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేస్తూ మీడియాకి అందించారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వివరిస్తూ వచ్చారు. అలాగే సాయి తేజ్ హాస్పిటల్ లో ఉండగానే ఆయన నటించిన లేటెస్ట్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమాను కూడా రిలీజ్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లుగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. సాయికి మరో జన్మలాంటిది.. అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడటం అనేది నిజంగా పునర్జన్మ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సాయి తేజ్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. కనుక ఆయన హాస్పిటల్ బిల్ అందులోనే కవర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎంత బిల్ అయ్యిందనే వార్తలు మాత్రం బయటకు రాలేదు. 35 రోజుల బిల్ సాయి తేజ్ ఇన్సూరెన్స్ పాలసీలోనే కట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఉజ్జాయింపు లెక్కల ప్రకారం.. సుమారుగా రూ.5 కోట్లకు పైగానే బిల్ అయి ఉంటుందని అర్థం అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…