OTT : ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలు, సిరీస్ ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. పలు సినిమాల తేదీలు తెలుసుకొని వాటిని వీక్షించడానికి సిద్ధమైపోతుంటారు. అలాగే ఈ వారం కూడా థియేటర్లలో విజయవంతమైన సినిమాలు కొన్ని ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయాయి. వీటితో దసరా పండుగ మరింత కళ సంతరించుకోనుంది. ఇక ఈ వారం ఓటీటీలలో రాబోయే సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించగా మిస్టరీ థ్రిల్లర్ గా విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ దుమ్ము రేపిన కార్తికేయ 2 సినిమా జీ 5 ఓటీటీలో అక్టోబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో వారికి ఎట్టకేలకు వినోదం లభ్యం కానుంది.
అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం బింబిసార కూడా జీ5 లో అక్టోబర్ 7 నుండి ప్రసారం కానుంది. క్యాథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చాలా కాలం తరువాత కళ్యాణ్ రామ్ కు మంచి విజయాన్ని అందించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. కనుక ఓటీటీలో కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
అశీష్ గాంధీ, చిత్ర శుక్లా జంటగా నటించిన ఉనికి అనే సినిమా అక్టోబర్ 5 నుండి ఆహా ఓటీటీ లో ప్రదర్శితం కానుంది. ప్రేక్షకులకు ఈ సినిమా గురించి అంతగా తెలియక పోయినా రేటింగ్ మాత్రం బాగానే ఉంది. కనుక ఈ మూవీని కూడా ప్రేక్షకులు చూడవచ్చు. అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షాబంధన్ అనే మూవీ జీ5 ఓటీటీలో అక్టోబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో ఆగస్టు 11న హిందీలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది.
అంతే కాకుండా ఈషో అనే మళయాళ థ్రిల్లర్ సినిమా కూడా అక్టోబర్ 5 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ అయిన ఇంగ్లీష్ చిత్రం ప్రే.. డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబర్ 7 నుండి ప్రసారం కాబోతుంది. ఇలా పలు భారీ యాక్షన్, థ్రిల్లర్ మూవీలు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనున్నాయి. దీంతో పండుగ వేళ ఓటీటీలు కళకళలాడనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…