Sara Arjun : ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ మూవీ తమిళనాట ఘన విజయం సాధించింది. కానీ తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయితే సినిమా హిట్, ఫ్లాప్ సంగతి పక్కన పెడితే.. ఇందులో నటించిన ఓ బ్యూటీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. ఆమె నటించింది కొన్ని సెకన్లే అయినా అందరి మనస్సులను దోచుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరా.. అని ఆలోచిస్తున్నారా.. ఆమె.. సారా అర్జున్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈమె నటించింది. కానీ యంగ్‌గా మారిన తరువాత ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఈమెను చూస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ 1 మూవీలో నందిని పాత్రలో నటించిన ఐశ్వర్యా రాయ్ చిన్నతనం క్యారెక్టర్‌లో సారా అర్జున్ నటించింది. ఈ క్రమంలోనే ఈమె యాక్టింగ్, అందానికి అందరూ ముగ్ధులవుతున్నారు. ఇక సారా అర్జున్ ప్రస్తుతం వయస్సు 17 ఏళ్లు కాగా.. ఈమె గతంలో విక్రమ్ నాన్న మూవీలో నటించింది. అలాగే పలు ఇతర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.
ఇక 2005లో జన్మించిన ఈ బ్యూటీ ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈమె దాగుడుమూతా దండాకోర్, జై హో, ఏక్ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా.. అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం 404 అనే బాలీవుడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే పొన్నియిన్ సెల్వన్ 2లో ఈమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…