OTT : కరోనా సమయంలో పెద్దగా సినిమాల సందడి లేదనే చెప్పాలి. కరోనా కాస్త శాంతించాక ప్రతి వారం ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో అరడజనుకి పైగా సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇందులో తెలుగుతోపాటు పలు భాషలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్, సోనీ లివ్‌తో పాటు ఇతర ప్లాట్ ఫామ్‌లలో ఎప్పటికప్పుడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీర్తి, సురేష్ సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సాని కాయిదం చిత్రం మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు.ఇందులో కీర్తి సురేష్ మాస్ లుక్‌లో అదరగొట్టనుంది.
అమితాబ్ బచ్చన్ నటించిన జుండ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. మే 6న జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ తప్పక అలరిస్తుంది.
కన్నడ భాషకు చెందిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందగా, ఇందులో ధర్మన్న కడూర్, కె జయరామ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మే 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తోంది.
హిందీ భాషకు సంబంధించిన థ్రిల్లర్ థార్ మూవీ. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ లో మే 6వ తేదీన ప్రీమియర్ అవనుంది. 80ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందింది.
ఇక థియేటర్‌లలో ప్రదర్శించబడే సినిమాల విషయానికి వస్తే..
యంగ్ హీరో శ్రీవిష్ణు మెయిన్ లీడ్ లో వస్తోన్న భళా తందనాన సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా, కేథరిన్ హీరోయిన్ గా నటించింది.
యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన సుమ వెండితెరపై నటించిన మూవీ జయమ్మ పంచాయతీ.. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఇందులో పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపించనుంది.
కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…