Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగ భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే తాజాగా ఈ చిత్రానికి చెందిన అఫిషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇందులో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు.
సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల్లో కామెడీ చేయడం తక్కువే. అలా చేసిన ఖలేజా మూవీ ఫ్లాప్ అయింది. కనుక కామెడీ జోలికి మహేష్ ఎక్కువగా వెళ్లడం లేదు. కానీ సర్కారు వారి పాట ట్రైలర్‌ను చూస్తే మహేష్ కాస్త కామెడీ ఎక్కువగా చేశాడనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు సాఫ్ట్ డైలాగ్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న మహేష్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను మాట్లాడడం మొదలు పెట్టాడు. సర్కారు వారి పాట ట్రైలర్‌ను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందులో ఆయన రెండు చోట్ల డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు.
ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోంచి విడుదలైన కళావతి, పెన్నీ పాటలతోపాటు టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇక మూవీలో మహేష్ లుక్, డైలాగ్స్, ఫైట్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…