OTT : వారం మారిందంటే చాలు.. ప్రేక్షకులు ఓటీటీల్లో ఈ వారం ఏయే మూవీలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయి.. వేటిని చూడాలి.. అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను, సిరీస్‌ను విడుదల చేస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీ యాప్‌లలో స్ట్రీమ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ కట్ టూ కట్ అనే కన్నడ సినిమా ఈ వారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమ్ చేస్తారు. ఇది ఒక కామెడీ డ్రామా సినిమా. కమెడియన్ దనీష్ సైత్ ఇందులో లీడ్ రోల్‌లో నటించారు. ఇటీవలే గుండె పోటుతో మరణించిన సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
లూప్ లపేటా అనే సినిమా ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. జర్మన్ మూవీ రన్ లోలా రన్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ, తాహిర్ రాజ్, శ్రేయ్ ధన్వంతరిలు కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.
నెట్ ఫ్లిక్స్‌లోనే ఫిబ్రవరి 3వ తేదీన ఓ సిరీస్ స్ట్రీమ్ కానుంది. మర్డర్ విల్లె అనే కామెడీ డ్రామా సిరీస్ ను స్ట్రీమ్ చేయనున్నారు. ఇందులో విల్ అర్నెట్, హనీఫ్ వుడ్, లిలన్ బౌడెన్‌లు కీలకపాత్రల్లో నటించారు.
ఫిబ్రవరి 4వ తేదీన జీ5 యాప్‌లో 100 అనే కన్నడ మూవీ స్ట్రీమ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఆయన ఇందులో కీలకపాత్రలో నటించారు.
సోనీ లివ్ ఓటీటీ యాప్‌లో ఫిబ్రవరి 4వ తేదీన రాకెట్ బాయ్స్ అనే కామెడీ డ్రామా సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఇందులో సర్‌భి, ఇశ్వక్ సింగ్‌లు కీలకపాత్రల్లో నటించారు. ఇద్దరు అద్భుతమైన భారతీయ సైంటిస్టులు హోమి భాభా, విక్రమ్ సారాభాయ్‌ల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీశారు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్ లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ది గ్రేట్ ఇండియన్ మర్డర్ అనే సిరీస్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. మిస్టరీ కథాంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 4వ తేదీన రండు అనే మళయాళం సినిమా స్ట్రీమ్ కానుంది. కామెడీ సినిమాగా దీన్ని తెరకెక్కించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…