IPL : ఈ ఏడాది ఐపీఎల్‌లో మరో రెండు కొత్త టీమ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్, లక్నో టీమ్‌లు ఈ సారి ఐపీఎల్‌లో సందడి చేయనున్నాయి. ఈ క్రమంలోనే లక్నో టీమ్ శరవేగంగా పనులు చేస్తోంది. తమ జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఇప్పటికే నియమించింది. అలాగే లక్నో సూపర్ జియాంట్స్ పేరిట జట్టుకు ఇటీవలే నామకరణం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం జట్టు లోగోను ఆవిష్కరించారు. ఇది సరికొత్త రీతిలో ఆకట్టుకుంటోంది.
లక్నో సూపర్ జియాంట్స్ టీమ్ కొత్త లోగోను భారత త్రివర్ణ పతాకం మోడల్‌లో తీర్చిదిద్దారు. పక్షి రెక్కలు విప్పుకున్నట్లుగా భారత జాతీయ పతాకంలోని రంగులను ఆవిష్కరించారు. మధ్యలో ఒక బ్యాట్‌ను ఉంచారు. కింద లక్నో సూపర్ జియాంట్స్ అని జట్టు పేరు పెట్టారు. ఇదే లోగోతో ఈ టీమ్ ఈసారి ఐపీఎల్‌లో బరిలోకి దిగనుంది. మరి ఈ జట్టుకు తొలిసారిగా అదృష్టం కలసి వచ్చి ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
లక్నో టీమ్ లోగోను తాజాగా ఆ టీమ్ మేనేజ్‌మెంట్ ట్విట్టర్‌లో ఆవిష్కరించింది. లక్నో టీమ్‌ను ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ రూ.7090 కోట్ల భారీ మొత్తంతో టెండర్‌లో దక్కించుకుంది. గతంలో ఇదే గ్రూప్ పూణె టీమ్‌ను సొంతం చేసుకోగా.. దాదాపుగా అదేలాంటి పేరును లక్నోకు పెట్టారు. కేవలం సిటీ పేరు మాత్రమే మారింది. ఇక కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించుకున్నందుకు అతనికి రూ.17 కోట్ల వేతనం ఇవ్వనున్నారు. అలాగే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ కు రూ.9.2 కోట్లు ఇచ్చి టీమ్‌లోకి తీసుకున్నారు. దీంతోపాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రూ.4 కోట్లతో టీమ్‌లోకి తీసుకున్నారు.
కాగా ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలం 2022 నిర్వహించనున్నారు. అందులో ఏకంగా 1000 కి పైగా ప్లేయర్లకు వేలం వేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…