Mouni Roy : హిందీ నటి మౌనీ రాయ్ సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలతో ఎంతో అలరిస్తుంటుంది. ఈ అమ్మడు అందులో ఏం షేర్ చేసినా వైరల్ అవుతుంటాయి. ఈమె గతేడాదే వివాహం చేసుకుంది. అనంతరం హనీమూన్‌కు వెళ్లగా అక్కడ ఆమె తన భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలను అప్పట్లో కొన్నింటిని షేర్ చేసింది. వాటిల్లో ఆమె అందాలను ఆరబోసింది. పెళ్లయి భర్త వెంటే ఉన్నా కూడా ఈమె గ్లామర్ షో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి.

అయితే లేటెస్ట్‌గా మౌనీ రాయ్ మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున ఒయ్యారాలు ఒలికిస్తూ ఆమె కూర్చున్న భంగిమను చూస్తుంటే మతులు పోతున్నాయి. అమరశిల్పి జక్కన చెక్కిన శిల్పంలా ఆమె అందాలు వర్ణించనలవి కాకుండా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే మౌనీ రాయ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు గతంలో ఆమె హనీమూన్‌కు వెళ్లినప్పటివి అయి ఉంటాయని తెలుస్తోంది. అప్పట్లో బ్యాలెన్స్ పెట్టిన కొన్ని ఫొటోలను ఆమె ఇప్పుడు షేర్ చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా.. పెళ్లయ్యాక కూడా మౌనీ రాయ్ గ్లామర్ ట్రీట్ ఆగడం లేదు.