Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అఖిల్, పూజా హెగ్డెల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. దీంతో అఖిల్‌కు తొలి హిట్ దక్కినట్లయింది. ఇక ఈ మూవీ సక్సెస్‌తో అఖిల్ మంచి జోష్ మీద ఉన్నాడు.
అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని ఇటీవలే ఆహా ప్లాట్‌ఫాంలో లాంచ్ చేశారు. శుక్రవారం నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. పలు కొత్త రికార్డులను నమోదు చేసింది.
#MostEligibleBachelor 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 run continues on @ahavideoIN
1️⃣ 0️⃣ 0️⃣ MILLION MINUTES in Just 2️⃣ Days 🔥#MEBOnAHA : https://t.co/CWvpVMv4nQ #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/qMahXYrEVP
— GA2 Pictures (@GA2Official) November 21, 2021
ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే 10 కోట్ల నిమిషాల వ్యూస్ వచ్చాయని ఆహా వెల్లడించింది. ఈమేరకు జీఏ2 పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఆహా యూజర్లు భారీ స్థాయిలో ఈ మూవీని వీక్షించి రికార్డును క్రియేట్ చేశారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాంపై కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు.
కాగా అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇటీవలే కరోనా రావడంతో మూవీ షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ పడింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది.