Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ డే అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని.. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి షోకి భారీ తేడాతో కలెక్షన్స్ ని పెంచుకుంటూ జోరు చూపించారు.
ఈ క్రమంలో రూ.4 కోట్లు, రూ.4.5 కోట్లు, రూ.5 కోట్లతో సక్సెస్ ఫుల్ గా మొదటి రోజు కలెక్షన్స్ ని రాబట్టారు. ఇక వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తోంది. అమెరికా ప్రీమియర్స్ అండ్ డే వన్ కలెక్షన్స్ అన్నీ కలిపి 2,25,000 డాలర్స్ మార్క్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా అదరగొట్టి టోటల్ వరల్డ్ వైడ్ గా రూ.6.8 కోట్ల రేంజ్ లో షేర్స్ ని దక్కించుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సంచలనం క్రియేట్ చేసింది.
సినిమా ఫస్ట్ డే టోటల్ ఏరియాల వారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను టోటల్ గా వరల్డ్ వైడ్ గా 18.5 కోట్ల రూపాయలకు అమ్మగా సినిమా 19 కోట్ల రూపాయల టార్గెట్ తో మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా మరో రూ.12.2 కోట్లతో షేర్ ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం క్లీన్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఏవిధంగా ఉంటుందో చూడాలి.