12th Man Review : వైవిధ్యభరితమైన చిత్రాలలో నటించడంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మంచి పేరుంది. ఆయన తన వయస్సుకు తగిన చిత్రాలను చేస్తుంటారు. తెలుగులోనూ ఆయన నటించిన అనేక చిత్రాలు ఇప్పటికే ఘన విజయం సాధించాయి. ఇక ఆయన లేటెస్ట్‌గా 12th Man సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని నేరుగా రిలీజ్ చేశారు. మళయాళం భాషలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
చంద్రశేఖర్ (మోహన్ లాల్) పోలీస్ అధికారి. డీఎస్‌పీగా పనిచేస్తుంటాడు. అయితే ఓ కేసులో ఈయన సస్పెండ్ అవుతారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఈయన ఓ రిసార్టులో పీకలదాకా మద్యం సేవించి ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఆ రిసార్ట్‌కే కొందరు ఓ పార్టీ నిమిత్తం వస్తారు. ఓ వ్యక్తి ఇచ్చే బ్యాచిలర్ పార్టీకి గాను అతని స్నేహితులు, వారి భార్యలు మొత్తం కలిపి 10 మంది.. అతనితో సహా అయితే 11 మంది పార్టీకి వస్తారు. అదే రిసార్ట్‌లో వారు మొత్తం 11 మంది పార్టీ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే వారు ఒక డేంజరస్ గేమ్ ఆడుతారు. దీని కారణంగా అందరూ డిస్టర్బ్ అవుతారు. ఇంతలో హఠాత్తుగా ఆ 11 మందిలో ఒక మహిళ చనిపోతుంది. ఈ క్రమంలోనే అక్కడే రిసార్ట్‌లో ఉన్న చంద్రశేఖర్ కేసును విచారించడం మొదలు పెడతాడు. చివరికి ఆ 10 మందిలో నిందితుడు లేదా నిందితురాలు ఎవరు ? అనే విషయాన్ని చంద్రశేఖర్ ఛేదిస్తాడు. అయితే ఈ మూవీలో ఇంకా అసలు ఏం జరిగిందో తెలసుకోవాలంటే.. దీన్ని ఓటీటీలో చూడాల్సిందే.
సినిమా కథ విషయానికి వస్తే.. ఆరంభంలో కొద్దిగా నెమ్మదిగా సాగినా.. హత్య సీన్ తరువాత చాలా వేగంగా సీన్స్ మారుతుంటాయి. 11 మందిలో ఒకామె హత్యకు గురైతే మిగిలిన వారిలో ఎవరు ఆ హత్య చేశారు అనే విషయాన్ని చాలా తెలివిగా చంద్రశేఖర్ ఛేదిస్తాడు. ఇక్కడే రచయిత ప్రతిభ కనబడింది. ఇక దర్శకుడు కూడా అన్ని కలగాపులగంలా ఉండే సీన్లను ఒకదాని తరువాత ఒకటి ప్రేక్షకులకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతూ సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. దీంతో ప్రేక్షకులకు ప్రతి విషయం సులభంగానే తెలిసిపోతుంది. అయితే మధ్యలో కన్నార్పకుండా.. ఒక్క డైలాగ్ కూడా మిస్ కాకుండా చూడాలి. అప్పుడే ప్రతి చిన్న డిటెయిల్ తెలుస్తుంది. కేసు ఎలా పరిష్కారం అయిందో అర్థమవుతుంది.
ఇక మోహన్ లాల్ మరోసారి ఈ సినిమాలో జీవించారనే చెప్పవచ్చు. మిగిలిన వారందరూ తమ పాత్రల పరిధుల మేర నటించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ బాగున్నాయి. మోహన్‌లాల్ సినిమా అంటే కచ్చితంగా కథకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే దీంట్లోనూ ప్రాధాన్యత కల్పించారు. కనుక సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తరహా సినిమాలను ఇష్టపడే వారు ఈ మూవీని తప్పక చూడాలి.. అని చెప్పవచ్చు. ఎంతో థ్రిల్‌ను అందిస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…