Mohan Lal : కరోనా పుణ్యమా అని గత ఏడాదిన్నర కాలం నుంచి ఓటీటీ యాప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. అనేక మంది స్టార్స్ ఇప్పటికీ తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలు అయితే వరుసగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నటించిన 12th Man అనే మూవీ కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీని ఓటీటీలో నేరుగా విడుదల చేసేందుకు మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ యాప్‌లోనే సందడి చేయనుంది.
12th Man సినిమాకు గాను డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆ యాప్‌లో నేరుగా రిలీజ్ కానుంది. దీన్ని అతి త్వరలోనే ఈ ప్లాట్ ఫామ్‌పై విడుదల చేయనున్నారు. ఇప్పటికైతే రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. కానీ ఈ వివరాలను.. ఇతర సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇక ఈ సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్ ఇందులో లీడ్ రోల్‌లో నటించారు. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీన్ని ఆంటోని పెరుంబవూర్ నిర్మించగా.. అనిల్ జాన్సన్ సంగీతం అందించారు. మళయాళం భాషలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…