Samantha : అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత ఆయన ఫ్యాన్స్ నుంచి ఏదో ఒక విధంగా విమర్శలను ఎదుర్కొంటూనే వస్తోంది. సమంత క్యారెక్టర్ మంచిది కాదని.. ఆమె డబ్బే పరమావధిగా జీవిస్తుందని.. ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని.. ఆమె చేసే గ్లామర్ షో వల్లే ఆమెకు చైతన్య విడాకులు ఇచ్చాడని.. ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తూ సమంతను అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా ఆమెపై మీమ్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇవి తగ్గినా.. తాజాగా కాజల్ అగర్వాల్ కొడుక్కి జన్మనివ్వడంతో ఆమెను సాకుగా చూపి మరోమారు సమంతను విమర్శించడం మొదలు పెట్టారు.
కాజల్ అగర్వాల్‌ను బంగారంతో పోల్చిన అక్కినేని ఫ్యాన్స్.. ఆమె పెళ్లయిన ఏడాదిలోపే బిడ్డను కనడాన్ని అభినందించారు. అసలైన ఇల్లాలు అంటే ఇలాగే ఉండాలని వారు కాజల్‌ను మెచ్చుకుంటున్నారు. అలాగే పనిలో పనిగా సమంతను ఇన్‌డైరెక్ట్‌గా తిడుతున్నారు. కాజల్ అగర్వాల్ నిజంగా బంగారమే.. పెళ్లయిన ఏడాదిలోపే బిడ్డను కన్నది.. కానీ కొందరు ఉంటారు.. వారు కుక్కలకు ఇచ్చిన విలువ భర్తకు ఇవ్వరు.. వాళ్లకు కుక్కలే కావాలి.. మొగుడు అక్కర్లేదు.. అని ఇన్‌డైరెక్ట్‌గా సమంతపై మీమ్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇవి గత 2, 3 రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి.
అయితే నాగచైతన్య ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఈ విమర్శలకు సమంత పరోక్షంగానే కౌంటర్ ఇచ్చింది. తాను మౌనంగా ఉన్నానని దాన్ని తన చేతగానితనం కింద భావించవద్దని.. తన మౌనాన్ని అంగీకారం అనుకోవద్దని.. తన జాలి, దయను తన బలహీనత అనుకోవద్దని.. సమంత ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. ఆమె ఇన్‌డైరెక్ట్‌గా చేసినప్పటికీ ఆ ట్వీట్ చైతూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిందేనని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే విడాకుల అనంతరం నాగచైతన్య కన్నా సమంతను విమర్శించే వారే ఎక్కువగా ఉండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…