Mohan Babu : చాలా కాలం తరువాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా.. ఈ మూవీ ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సమయంలో మంచు ఫ్యామిలీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ మూవీని దారుణంగా ట్రోల్ చేశారు. అసలు తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక ట్రోల్స్ ను, విమర్శలను ఎదుర్కొన్న మూవీగా సన్ ఆఫ్ ఇండియా రికార్డులను సృష్టించిందని చెప్పవచ్చు. ఓ దశలో మంచు ఫ్యామిలీ తమపై వస్తున్న ట్రోల్స్, విమర్శలకు స్పందించి.. ఎవరైనా తమను కించ పరిచేలా పోస్టులు పెట్టినా, వీడియోలను అప్‌లోడ్ చేసినా రూ.10 కోట్ల వరకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ఆ విషయంపై కూడా వారి మీద ట్రోల్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది.
మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మూవీ ఎలాంటి ప్రకటనా హడావిడి లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. మే 17 నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. దీన్ని ప్రేక్షకులు చూడదలిస్తే చూడవచ్చు. ఇక ఈ మూవీలో మీనా, ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అయితే థియేటర్లలోనే ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ మూవీని ఓటీటీలో చూస్తారా ? అసలు ప్రేక్షకులు అంత సాహసం చేస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సన్ ఆఫ్ ఇండియా మూవీపై వాస్తవానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అయితే ఆ సమయంలో మంచు ఫ్యామిలీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని చెప్పి.. ప్రేక్షకులు సహజంగానే మంచు ఫ్యామిలీపై వ్యతిరేకతను ఏర్పరుచుకున్నారు. అందులో భాగంగానే ఆ తరువాత వచ్చిన సన్ ఆఫ్ ఇండియా మూవీపై తమ ప్రతీకారం అంతా చూపించారు. కనుకనే ఆ మూవీ గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండడంతో దీన్ని ఎంత మంది చూస్తారు.. మళ్లీ ఏమైనా ట్రోల్స్ వస్తాయా.. వాళ్లను విమర్శలు చేస్తారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.